
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా పర్యటన ముగియడంతో ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పాలెం ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు ఘనస్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ శ్రేణులతో విమానాశ్రయ పరిసరాలు సందడిగా మారాయి.
అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడి ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు. ఆపై ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని భారత వాణిని బలంగా వినిపించారు.