ప్రజాదరణలో మోదీ ముందంజ.. | PM Narendra Modi is Far More Popular Than Rahul In Pse Poll | Sakshi
Sakshi News home page

ప్రజాదరణలో మోదీ ముందంజ..

Mar 11 2019 10:44 AM | Updated on Mar 11 2019 7:17 PM

PM Narendra Modi is Far More Popular Than Rahul In Pse Poll - Sakshi

ప్రజాదరణలో దూసుకుపోతున్న మోదీ..ఎస్సీ, ముస్లిం ఓటర్లలో రాహుల్‌ ప్రాబల్యం

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ పలు ప్రీపోల్‌ సర్వేలు వెల్లడవుతూ పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఇక ప్రధానిగా నరేంద్ర మోదీని తిరిగి కోరుకుంటున్నామని ఇండియా టుడే పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (పీఎస్‌ఈ) సర్వేలో 52 శాతం మంది పేర్కొనగా, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వైపు 33 శాతం మంది మొగ్గుచూపారు. కాగా ఎస్సీలు, మైనారిటీల్లో అత్యధిక శాతం మంది రాహుల్‌ను తదుపరి ప్రధానిగా చూడాలనుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం.

ఎస్సీ ఓటర్లలో 44 శాతం మంది రాహుల్‌ను భావి ప్రధానిగా ఎంచుకోగా, 41 శాతం మంది మోదీ వైపే మొగ్గుచూపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎస్సీలో రాహుల్‌కు ఆదరణ పది శాతం పెరగ్గా, ప్రధాని మోదీకి ఎస్సీల్లో ఆదరణ ఆరు శాతం తగ్గిందని పీఎస్‌ఈ పోల్‌ వెల్లడించింది. ఇక ముస్లింల్లో 61 శాతం మంది రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటుండగా, 18 శాతం మంది ముస్లింలు తిరిగి మోదీనే ప్రధాని కావాలని అభిలషిస్తున్నామని చెప్పారు. కాగా ఏప్రిల్‌ 11 నుంచి మార్చి 19 వరకూ ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మే 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement