మీడియా చాలా బాగా పనిచేసింది: మోదీ | PM appreciates cooperation of states | Sakshi
Sakshi News home page

మీడియా చాలా బాగా పనిచేసింది: మోదీ

Apr 27 2015 1:26 PM | Updated on Sep 17 2018 7:44 PM

మీడియా  చాలా బాగా పనిచేసింది: మోదీ - Sakshi

మీడియా చాలా బాగా పనిచేసింది: మోదీ

నేపాల్లో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న అన్ని వర్గాల వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు.

న్యూఢిల్లీ:  నేపాల్లో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న  అన్ని వర్గాల వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతజ్ఞతలు  తెలిపారు.    ముఖ్యంగా గ్రౌండ్ ద రిపోర్ట్ ఇచ్చిన మీడియాకు ఆయన ట్విట్టర్లో ప్రత్యే క ధన్యవాదాలు  తెలియజేశారు. చాలా ధైర్యంగా వార్తలను ప్రజలకు అందించారంటూ మీడియాను  ప్రశంసించారు. నేపాల్లో భూకంపం సృష్టించిన విలయం  సందర్భంగా భారత ప్రభుత్వం స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తడంతోపాటు థ్యాంక్యూ పీఎం అంటూ ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ ట్విట్టర్లో సందేశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. నిజానికి ఈ అభినందనలు సేవో పరమోధర్మ  సిద్ధాంతాన్ని బోధిస్తున్న భారత సంస్కృతికి దక్కాలన్నారు. భారతదేశం నుండి తరలివెళ్లిన ఎన్డిఆర్ఆఫ్ దళాలు,  సైన్యం, వైద్యులు,  వాలంటీర్లందరికీ  ఆయన  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ కు వారు అన్ని విధాల సహాయం అందిస్తున్నారని, నేపాల్ కోలుకునేందుకు సహకరిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా డబ్బు, బట్టలు, మందుల రూపంలో సహాయాన్ని అందజేస్తున్న వారంరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.

నేపాల్  ప్రజల బాధను తమ  బాధగా భారతదేశ  ప్రజలు భావిస్తున్నారన్నారు. కాగా శనివారం ప్రకృతి  ప్రకోపంతో  భీతిల్లిన  నేపాల్ లో పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్  చేపట్టిన భారత ప్రభుత్వం,   అక్కడ  చిక్కుకున్న భారతీయులను ఇప్పటికే స్వదేశం  రప్పించింది.  మిగిలిన వారికోసం కూడా   ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement