'రెండో విడత ఆర్థిక సంస్కరణలు అమలు' | no problem for notes demonetization, says narendra modi | Sakshi
Sakshi News home page

'రెండో విడత ఆర్థిక సంస్కరణలు అమలు'

Dec 24 2016 1:31 PM | Updated on Aug 15 2018 2:30 PM

'రెండో విడత ఆర్థిక సంస్కరణలు అమలు' - Sakshi

'రెండో విడత ఆర్థిక సంస్కరణలు అమలు'

త్వరలోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ముంబై: త్వరలోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎస్టీపై కసరత్తు జరుగుతుందన్న మోదీ.. ఇది వాస్తవ రూపంలోకి అతి తొందర్లోనే వస్తుందన్నారు. నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మేనేజ్‌మెంట్ ప్రాంగణాన్ని ప్రారంభించిన మోదీ సందర్భంగా ప్రసంగించారు.

 

పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన ఇబ్బందులు తాత్కాలికమని మోదీ మరోసారి ఉద్ఘాటించారు. భవిష్యత్తులో దీనివల్ల లాభాలు ఉన్నాయంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీనిలో భాగంగా రెండో విడత ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో దేశ భవిష్యత్తు సువర్ణమయంగా ఉంటుందన్నారు. ఉజ్వల అవకాశాల కేంద్రంగా భారత్ ఎదుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement