మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రమాదకారి అని, బీజేపీని హైజాక్ చేశారని చవాన్ ఆరోపించారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రమాదకారి అని, బీజేపీని హైజాక్ చేశారని చవాన్ ఆరోపించారు. మోడీ నిరంకుశ ధోరణులను అవలంభిస్తున్న మోడీ ప్రమాదకారి అని, అందుకే ఆయన గురించి కాంగ్రెస్ మాట్లాడాల్సివస్తోందని అన్నారు. బీజేపీ సీనియర్ నేతలను పక్కకు తప్పించి పార్టీని పూర్తిగా తన గుప్పిట్లలోకీ తీసుకున్నారని విమర్శించారు.
బీజేపీలో మోడీ వన్ మ్యాన్ షోగా మారిపోయారని, భారత రాజకీయాలను కూడా ఒకే వ్యక్తి శాసించే దిశగా మోడీ ప్రయత్నిస్తుండటం ప్రమాదకరమని చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలను హెచ్చరిస్తున్నామని చెప్పారు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా మోడీ వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ, ఇలాంటి వ్యక్తికి అత్యున్నత పదవి కట్టబెడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించుకోవచ్చని చవాన్ పేర్కొన్నారు.