ముంబయి టు గోవా ఆరుగంటలే | Mumbai to Goa in just 6 hours soon: Gadkari | Sakshi
Sakshi News home page

ముంబయి టు గోవా ఆరుగంటలే

Sep 22 2016 1:34 PM | Updated on Sep 4 2017 2:32 PM

ముంబయి టు గోవా ఆరుగంటలే

ముంబయి టు గోవా ఆరుగంటలే

త్వరలోనే ముంబయి నుంచి గోవాకు మధ్య కేవలం ఆరుగంటల్లో చేరుకునే అవకాశం రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

పనాజీ: త్వరలోనే ముంబయి నుంచి గోవాకు మధ్య కేవలం ఆరుగంటల్లో చేరుకునే అవకాశం రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాలుగు లేన్ల కాంక్రీటు రహదారిని నిర్మించడమే అందుకు కారణం అని ఆయన చెప్పారు.

'మేం నిర్మించబోయే నాలుగు లేన్ల సిమెంటు రహదారి వల్ల త్వరలోనే గోవా నుంచి ముంబయి మధ్య ప్రయాణం ఆరుగంటల్లో ముగియనుంది' అని గడ్కరీ గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. రోజుకు 22 కిలోమీటర్ల మేర రహదారి నిర్మిస్తామని చెప్పారు. దీంతోపాటు ఉత్తర గోవాలో రాబోతున్న కొత్త విమానాశ్రయం కోసం ఎనిమిది కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement