వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

Mumbai Kolhapur Mahalaxmi Express passengers struck - Sakshi

సాక్షి, ముంబై: భారీ వర్షాలు, వరద బెడద మహారాష్ట్రను  పట్టి పీడిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు ముంబై నగరంతోపాటు, శివారు ప్రాంతాలను స్తంభింపజేసాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి.  మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రకటించారు. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే 100 కాల్‌ చేయాలని ముంబై పోలీసులు తెలిపారు. 

ఇది ఇలా వుంటే ముంబై-కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ బద్లాపూర్- వంగని మధ్య పట్టాలపై నిలిచిపోయింది. దీంతో సుమారు 2000 మందికి పైగా ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. రైలు నిలిచిపోయిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సిటీ పోలీసులుస్పాట్‌కు చేరుకుని ప్రయాణికులకు బిస్కెట్లు, నీటిని అందిస్తున్నారు. మరోవైపు ఈ మార్గంలో రైళ​ రాకపోకలను నిలిపివేశారు. బద్లాపూర్ - కర్జాత్ / ఖోపోలి మధ్య రైలు సేవలను రద్దు చేశామని రైల్వే శాఖ ట్వీట్‌ చేసింది. "కుర్లా-థానే బెల్ట్ లో చాలా భారీ వర్షాలు రానున్నాయనీ, ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని చీఫ్పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ట్వీట్‌ చేశారు. ప్రయాణీకులను విమానం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.  కానీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్నాయన్నారు.

మరోవైపు భారీ వర్షాల కారణంగా శనివారం ముంబై అంతర్జాతీయవిమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించని కారణంగా11 విమానాలను రద్దు చేయగా,  తొమ్మిందింటిని దారి మళ్లించారు. 

#Maharashtra: Several places water-logged, after Waldhuni river overflows following heavy rainfall in the area. Visuals from Kalyan area. #MumbaiRains pic.twitter.com/loaP8mylnr

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top