ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు | Mumbai City Waterlogged After Overnight Downpour | Sakshi
Sakshi News home page

ముంబయిలో భారీ వర్షాలు.. రోడ్లపై మోకాళ్లలోతు నీరు

Jul 8 2024 7:39 AM | Updated on Jul 8 2024 11:39 AM

Mumbai City Waterlogged After Overnight Downpour

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ప్రధాన  రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచి ట్రాపిక్‌ జామ్‌ అయింది. 

పలు రూట్లలో లోకల్‌ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్‌పై చెట్లు పడిపోవడంతో కసారా-టిట్వాలా సెక్షన్‌లో రైళ్లను రద్దు చేశారు. 

నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన వీడియోలను పలువురు ముంబైకర్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement