మోడీపై ‘కామన్’ పోటీకి కాంగ్రెస్ నో | Modi 'Common' competition, the no- | Sakshi
Sakshi News home page

మోడీపై ‘కామన్’ పోటీకి కాంగ్రెస్ నో

Mar 19 2014 3:43 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీగా వారణాసిలో ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపుతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది.

బెంగళూరు: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీగా వారణాసిలో ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపుతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, తమ పార్టీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.


మోడీ, కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై వ్యాఖ్యానించవలసిన అవసరం లేదన్నారు. ప్రతి నియోజకవర్గంపై తమకున్న అంచనాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకుంటే మోడీపై ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తానని ఆప్ నేత కేజ్రీవాల్ ప్రకటించిన విషయంపై ప్రశ్నించగా సింఘ్వి పైవిధంగా సమాధానమిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement