ఎగ్‌ చాలెంజ్‌.. 42వ గుడ్డు తింటూ..

Man Eats 41 Eggs For Bet And Dies In Uttar Pradesh - Sakshi

లక్నో :  ఓ వ్యక్తి పందెం కాసి ప్రాణాలు తీసుకున్నాడు. రూ. 2వేల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 42 ఏళ్ల సుభాష్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన స్నేహితుడిలో జౌన్‌పూర్‌లోని బీబీగంజ్‌ మార్కెట్‌ ఏరియాలో గుడ్లు తినడానికి వెళ్లాడు. అయితే అక్కడ సుభాష్‌కు ఆయన స్నేహితుడికి మధ్య తిండి విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఎవరు 50 గుడ్లు తింటే వారికి రూ. 2,000 ఇవ్వాలని ఇద్దరూ పందెం వేసుకున్నారు. 

అయితే ఈ బెట్టింగ్‌ సిద్ధపడ్డ సుభాష్‌.. 41 గుడ్లు తినేశాడు. అయితే 42వ గుడ్డు తింటున్న సమయంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే సుభాష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సూచన మేరకు అతన్ని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కువగా తినడం వల్లే సుభాష్‌ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించడానికి సుభాష్‌ కుటుంబ సభ్యులు నిరాకరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top