
భోపాల్ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. టాండన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. పలు ఉన్నత పదవులను చేపట్టారు.
బీజేపీ తొలినాళ్ల నుంచి క్రమశిక్షణగల నేతగా గుర్తింపు పొందిన లాల్జీ.. ఉత్తరప్రదేశ్ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. 2009లో లక్నో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైయ్యారు. అనంతరం తొలిసారి 2019 జూలై 20న మధ్యప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో తొలి ఏడాది పూర్తి చేసుకోవడం విశేషం.