పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ... ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతిపట్ల సంతాప తీర్మానం చదివి వినిపించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు.
మరోవైపు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మే 13 వరకు కొనసాగుతాయి. మొత్తం మీద ఈసారి 13 రోజులపాటు సభ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వేలు, 2015-16 సాధారణ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. అలాగే ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను ఆమోదించాల్సి ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగడం విదితమే.