లోక్‌సభ రేపటికి వాయిదా | Lok Sabha adjourned for the day today | Sakshi
Sakshi News home page

లోక్‌సభ రేపటికి వాయిదా

Aug 19 2013 4:59 PM | Updated on Sep 1 2017 9:55 PM

బీజేపీ సభ్యుడు దిలీప్‌సింగ్‌ జుదేవ్‌(64) మృతికి సంతాపంగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

న్యూఢిల్లీ:బీజేపీ సభ్యుడు దిలీప్‌సింగ్‌ జుదేవ్‌(64) మృతికి సంతాపంగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.  సభ ప్రారంభమైన వెంటనే  జుదేవ్‌ మరణవార్తను స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు.ఆయన మృతికి  సంతాపం తెలిపిన వెంటనే స్పీకర్‌  సభను రేపటికి వాయిదా వేశారు.   ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జుదేవ్‌  అనారోగ్యం కారణంగా  ఆగస్టు 14న గుర్గావ్‌లో కన్నుమూశారు.  జుదేవ్‌.... 2003 వాజ్‌పేయ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, సింధు రక్షక్ ప్రమాదంలో మరణించిన ఆరుగురు నావికులకు లోక్ సభ సంతాపం తెలిపింది.

రాజ్యసభలో గందరగోళం పరిస్థితులు కారణంగా తొలుత మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌పై కొందరు, ఉల్లిధరలపై మరికొందరు, కోల్‌గేట్‌ పత్రాల మాయంపై ఇంకొందరు విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో తీవ్రగందరగోళం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement