జడ్జీల సంఖ్య, రిటైర్మెంట్ వయస్సు పెంపు | Law panel for increase in judges' strength | Sakshi
Sakshi News home page

జడ్జీల సంఖ్య, రిటైర్మెంట్ వయస్సు పెంపు

Jul 8 2014 4:27 AM | Updated on Sep 2 2017 9:57 AM

దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో,...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో,...హైకోర్టులు, ఇతర దిగువ కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సత్వరం చర్యలుతీసుకోవాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. హైకోర్టులలో ఖాళీగా ఉన్న 270 జడ్జీల పోస్టులను లా కమిషన్ ప్రస్తావించింది. కేసుల పరిష్కారానికి నిర్దిష్టమైన వ్యవధిని నిర్ణయించాలని స్పష్టంచేసింది. తన సిఫార్సులతో కూడిన నివేదికను లా కమిషన్ సోమవారం న్యాయ శాఖకు సమర్పించింది.
 
దేశంలో ఉన్న 24 హైకోర్టుల న్యాయమూర్తులతో సమానంగా, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును కూడా 62ఏళ్లకు పెంచాలని,  కేసుల విచారణకు హేతుబద్ధమైన కాలవ్యవధిని సత్వరం నిర్ణయించాలని కూడా లా కమిషన్ సూచించింది. జడ్జీల పనితీరు ప్రమాణాలను బే రీజు వేయడానికి కేసు కాలవ్యవధిని ప్రాదిపదికగా వినియోగించాలని కూడా  సిఫార్సు చేసింది. దేశంలోని వివిధ కోర్టుల్లో 3.13కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నట్టు  కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం లోక్‌సభకు సమర్పించారు. సుప్రీంకోర్టులో 63,843కేసులు, హైకోర్టులలో 44.62లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement