పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి! | landslide near pune, 17 feared dead | Sakshi
Sakshi News home page

పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి!

Jul 30 2014 10:18 PM | Updated on Sep 2 2017 11:07 AM

పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి!

పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల అంబెగావ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటికింద పడి దాదాపు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల అంబెగావ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటికింద పడి దాదాపు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద దాదాపు 150 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రం నుంచి వెంటనే విపత్తు నివారణ బృందాలను సంఘటన స్థలానికి తరలించారు.

జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) కూడా ఇక్కడ సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అయితే శిథిలాల కింద సరిగా ఎంతమంది ఉన్నారన్న విషయం, వారి పరిస్థితి ఏంటో కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పుణె పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటి ఫలితంగానే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement