తన జీవితంలో దీపావళి ఇంత అద్భుతంగా జరగడం ఇదే తొలిసారని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అన్నారు.
న్యూఢిల్లీ: తన జీవితంలో దీపావళి ఇంత అద్భుతంగా జరగడం ఇదే తొలిసారని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అన్నారు. ఊహించని స్థాయిలో బీజేపీ ఎదిగిందని అద్వానీ అన్నారు.
ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం అందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరేంద్ర మోడీ సన్మానించారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడారు.