ఉన్నావ్‌ కేసు : ఢిల్లీ హైకోర్టుకు సెంగార్‌ | Kuldeep Singh Sengar Challenges Life Imprisonment Verdict In Delhi High Court | Sakshi
Sakshi News home page

ఉన్నావ్‌ కేసు : ఢిల్లీ హైకోర్టుకు సెంగార్‌

Jan 15 2020 6:47 PM | Updated on Jan 15 2020 7:46 PM

Kuldeep Singh Sengar Challenges Life Imprisonment Verdict In Delhi High Court - Sakshi

ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో విధించిన జీవిత ఖైదును సవాల్‌ చేస్తూ కుల్దీప్‌ సెంగార్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్‌ సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తనకు విధించిన యావజ్జీవ ఖైదును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఉన్నావ్‌లో మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో గత ఏడాది డిసెంబర్‌ 20న సెంగార్‌కు తీస్‌హజారి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. జీవిత ఖైదుతో పాటు రూ 25 లక్షల జరిమానా విధించింది. ఆయనకు జైలు శిక్ష రెండేళ్లకు పైగా విధించడంతో యూపీ అసెంబ్లీకి సెంగార్‌ ఎన్నిక రద్దయింది. ఐపీసీ సెక్షన్‌ 376, పోక్సో చట్టం కింద సెంగార్‌పై లైంగిక దాడి అభియోగాలను ఢిల్లీలోని తీస్‌ హజారి కోర్టు ధ్రువీకరించింది. సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిరూపించగలిగిందని తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ పేర్కొన్నారు. సెంగార్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement