
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయంలో ఉన్న హోంశాఖ ఆఫీసులో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో సహాయమంత్రిగా నిత్యానంద రాయ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందుకేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు శ్రీపాద యశో నాయక్ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.