శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే.. | Kerala Family Keeps Dead Man's Body In House For 3 Months | Sakshi
Sakshi News home page

శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే..

Jul 6 2017 5:33 PM | Updated on Apr 3 2019 5:44 PM

శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే.. - Sakshi

శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే..

చనిపోయిన ఇంటి పెద్ద తిరిగి వస్తాడని శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే పెట్టి ప్రార్థనలు చేసింది ఓ కుటుంబం.

మల్లాప్పురం: కేరళలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఇంటి పెద్ద తిరిగి వస్తాడని శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే పెట్టి  ప్రార్థనలు చేసింది ఓ కుటుంబం. వి. సయేద్‌(50)  అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ మత ప్రబోధకుడిగా పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబసభ్యులు శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే అట్టిపెట్టుకుని రోజూ ప్రార్థనలు చేస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వారికి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బలవంతంగా గది తలుపులు తెరిచారు. చనిపోయిన సయేద్‌ చుట్టూ ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కూర్చుని ప్రార్థన చేస్తూ కనిపించడంతో కంగుతిన్నారు. శవం పూర్తిగా కుళ్లిపోయి కేవలం ఎముకలు(స్కెలిటన్‌) మాత్రమే మిగిలాయి. పోలీసులు, సయేద్‌ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సయేద్‌ కుటుంబసభ్యులు ఎప్పుడూ చుట్టుపక్కల వారితో ఎక్కువగా మాట్లాడేవారు కారని స్థానికులు చెబుతున్నారు. సయేద్‌ కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement