ఈ ఏడాది భారత్‌లోని లిపులేఖ్ పాస్ గుండా రికార్డు స్థాయిలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు భక్తులు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.
డెహ్రడూన్ : ఈ ఏడాది భారత్‌లోని లిపులేఖ్ పాస్ గుండా రికార్డు స్థాయిలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు భక్తులు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సిక్కింలోని నాథూలా పాస్ గుండా టిబెట్ మీదుగా భారతీయ భక్తులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళతారు. అయితే ఈ ఏడాది డోక్లాం సమస్యతో చైనా నాథూలా పాస్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్నామ్నాయంగా ఉత్తారఖండ్‌లోని లిపులేఖ్ పాస్ గుండా భక్తులను యాత్రకు అనుమతించింది.
యాత్ర గడుపు సమీపిస్తుండడంతో శుక్రవారం 33 మందితో మానస సరోవర్ యాత్రకు చివరి బృందం లిపులేఖ్ పాస్‌గుండా బయలుదేరి వెళ్లింది. యాత్ర ముగించుకుని ఈ బృందం సెప్టెంబర్ 11న ఢిల్లీ చేరుతుందని అధికారులు తెలిపారు. లిపులేఖ్ పాస్ గుండా ఈ ఏడాది మొత‍్తం 919 మంది భక్తులు సురక్షింతగా కైలాస్ మానస సరోవర్ యాత్ర చేసినట్లు ఉత్తరాఖండ్ అధికారులు చెబుతున్నారు.