కేంద్ర మంత్రిపై మరో మంత్రి ఫైర్ | Javadekar's Environment Ministry Allows Culling of Animals, Maneka Fumes | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిపై మరో మంత్రి ఫైర్

Jun 9 2016 1:08 PM | Updated on Sep 4 2017 2:05 AM

కేంద్ర మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేధాలు తలెత్తాయి కేంద్ర మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేధాలు తలెత్తాయి.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేధాలు తలెత్తాయి. కొన్ని రాష్ట్ర్రాల్లో  జంతువులను వధించడానికి   కేంద్ర ప్రర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనుమతి ఇవ్వడాన్ని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తప్పు పడుతూ ఆయనకు లేఖ రాశారు.నీలి ఎద్దు (నిల్గాయి),అడవి పంది ని వధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రకాశ్ జవదేకర్ ఏరాష్ట్ర ప్రజలు ఏజంతువు కావాలంటే వాటిని వధించడానికి అనుమతులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్లో ఏనుగులను, హిమాచల్ ప్రదేశ్ లో కోతులను, గోవాలో నెమళ్లను, చంద్రాపూర్ లో 53 అడవి పందులను చంపడానికి ఇప్పటివరకు అనుమతులు ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ విధంగా క్రూరంగా చంపడానికి అనుమతులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని మేనక ప్రశ్నించారు. 2015 లో పంటలను నాశనం చేసే జంతువులను కూడా కీటకాలు గానే భావించాలనే మెమరాండాన్ని పర్యావరణ శాఖ జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్ రైతుల పంటలు నాశనం చేస్తున్న జంతువులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని రాష్ట్ర్ర ప్రభుత్వాలు కోరాయని అందుకే కొన్ని రాష్ట్రాల్లో  చట్టం ప్రకారం వాటి సంహరణకు అనుమతి ఇచ్చామని తెలిపారు. గతంలో ఉత్తరాఖండ్ లో పోలీసు గుర్రం శక్తి మాన్ పై  బీజేపీ ఎమ్మెల్యే దాడి చేయగా అది మృతి చెందిన విషయంలో కూడా మేనక తీవ్రంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement