గన్ మిస్ఫైర్.. జవాన్కు గాయాలు | ITBP jawan injured after he accidently shot self in bihar | Sakshi
Sakshi News home page

గన్ మిస్ఫైర్.. జవాన్కు గాయాలు

Sep 24 2015 5:17 PM | Updated on Jun 4 2019 6:41 PM

గన్ మిస్ఫైర్.. జవాన్కు గాయాలు - Sakshi

గన్ మిస్ఫైర్.. జవాన్కు గాయాలు

ఏకే-47 గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలింది. ఈ ఘటనలో ఐటీబీపీ జవాన్ గాయపడ్డాడు.

బక్సార్(బిహార్) : ఏకే-47 గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ఐటీబీపీ జవాన్ గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... రాకేష్ కుమార్ ఐటీబీపీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం  తన సర్వీస్ రివాల్వర్ ను క్లీన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో  గన్ మిస్ ఫైర్ అయింది. రాకేష్ కుమార్ కాలుకు గాయాలయినట్లు సదార్ హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ ఆర్కే గుప్తా తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం రాకేష్ కుమార్ ను పట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు  తరలించినట్లు గుప్తా వివరించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో అతడు బందోబస్తుకు వచ్చాడు. అదృష్టవశాత్తూ జవాన్ ప్రాణానికి ప్రమాదమేం లేదన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement