క‌రోనాకు త్వ‌ర‌లోనే మెడిసిన్!

Interferon Is Effective To Cure Covid-19 Said By  Bengaluru oncologist  - Sakshi

సాక్షి, బెంగుళూరు: కోవిడ్‌-19 వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈక్రమంలో ఇంటర్ఫెరాన్ ప్రోటీన్‌తో కూడిన స‌మ్మేళ‌నం క‌రోనా ర‌క్కసిని జ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషించ‌నుంద‌ని ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు విశాల్‌ రావు తెలిపారు. సాధార‌ణంగా మానవ శరీర కణాలు వైరస్‌లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, అయితే కోవిడ్‌-19 విష‌యంలో మాత్రం ఇవి ప‌నిచేయండం లేద‌ని , అంతేకాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌ట్లు శుక్రవారం పేర్కొన్నారు.
(చదవండి: కరోనా: పాత షోలు పునఃప్రసారం)

‘రెగ్యుల‌ర్ చెకప్‌లో భాగంగా మనుషుల ర‌క్త నమూనాలను సేక‌రించిన‌ప్పుడు బప్ఫీకోట్ అనే ప‌దార్థం ఉత్న‌న్న‌మ‌వుతుంది. దీని నుంచే ఇంటర్ఫెరాన్ అనే ప్రోటీన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుందని గుర్తించిన‌ట్లు వెల్లడించారు. ఈ రెండింటికీ సైటోకిన్లతో కూడిన ఒక స‌మ్మేళ‌నాన్ని జోడించి చికిత్స అందించ‌డం ద్వారా ఇది క‌రోనాపై శ‌క్తిమంతంగా పోరాడ‌గ‌లద‌ని విశ్వ‌సిస్తున్నాం. ఇప్ప‌టికే దీని గురించి రాష్ర్ట ప్ర‌భుత్వానికి తెలియ‌జేశాం’ అని డాక్ట‌ర్ విశాల్‌రావు తెలిపారు. ఈ ప్రత్యేక ఇంటర్ఫెరాన్ థెర‌పీని ప్రారంభ‌ద‌శ‌లో ఉన్న క‌రోనా రోగుల‌పై ప్ర‌యోగించ‌నున్న‌ట్లు చెప్పారు. చివ‌రి ద‌శ‌లో ఉన్న రోగులకు వారి ఎముక మజ్జ నుంచి లేదా దాత‌ల నుంచి సేక‌రించిన క‌ణాలను ఉప‌యోగించి చికిత్స అందించనున్నట్టు తెలిపారు.
(చదవండి: మహిళా ఉద్యోగులపై పెరిగిన పని భారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top