యుద్ధమే వస్తే.. ఎవరి సత్తా ఎంత?

If War Is Compulsary What Is The Capacity Of Bharath And Pak - Sakshi

భారత్‌–పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచివి కావని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హెచ్చరిస్తుంటే.. అక్టోబర్, నవంబర్‌లో భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధమే జరుగుతుందని, అదే ఆఖరి యుద్ధమని ఆ దేశ రైల్వేమంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన తర్వాత సరిహద్దుల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్‌ సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకువచ్చి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు చేసింది. ఇప్పుడు భారత్, పాక్‌ మధ్య యుద్ధం వస్తే ఎవరి బలాలు ఎంత.. ఎవరి సత్తా ఎంత.. అన్నది ఆసక్తిని రేపుతోంది. సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌) లెక్క ప్రకారం...  

భారత క్షిపణులు..
భారత్‌ దగ్గర 3,000 కి.మీ. నుంచి 5,000 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే  అగ్ని–3 సహా తొమ్మిది రకాలైన బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయి.  

పాక్‌ క్షిపణులు..
పాకిస్తాన్‌.. చైనా సహకారంతో క్షిపణుల్ని అభివృద్ధి చేసింది. తక్కువ, మధ్య తరహా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే  క్షిపణులు ఉన్నాయి. భారత్‌లో ఏ ప్రాంతాన్నయినా లక్ష్యంగా చేసుకునే క్షిపణులు పాక్‌ దగ్గరున్నాయి. 2,000 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించే షాహీన్‌–2 క్షిపణి పాక్‌ దగ్గర ఉంది.  

1993, 2006 మధ్య కాలంలో పాకిస్తాన్‌ జీడీపీలో ఏకంగా 20శాతానికి పైగా రక్షణ రంగానికి కేటాయించినట్టు స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top