నిషేధంపై టిక్‌టాక్ స్పందన

Hours After BanTikTok  Clarifications - Sakshi

చైనా సహా ఏ ప్రభుత్వానికీ డేటా లీక్ చేయలేదు

వినియోగదారుల గోప్యత, భద్రతకే  మొదటి ప్రాధాన్యం

 భారతీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాం

సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ దాడి ముప్పు ఉందన్న అంచనాల మధ్య చైనాకు చెందిన టిక్‌టాక్  సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది.  భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా  హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. (ప్లేస్టోర్‌ నుంచి టిక్‌టాక్‌ తొలగింపు)

ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు" గా అభివర్ణించించిన గాంధీ 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్,  విద్యావేత్తలు  సహా ఎంతోమందికి  జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులే  అన్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా  ఈ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నట్లు తెలిపారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు)

చదవండి : టిక్‌టాక్‌ బ్యాన్ : ఇన్‌స్టా, యూట్యూబ్ ఉందిగా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top