2002 గోద్రా అల్లర్ల లో ఆరుగురిని సజీవ దహనం చేసిన కేసులో గుజరాత్ హిమ్మత్ నగర్ లోని స్పెషల్ ట్రయల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశాలున్నా
అహ్మదాబాద్ : 2002 గోద్రా అల్లర్ల లో ఆరుగురిని సజీవ దహనం చేసిన కేసులో గుజరాత్ హిమ్మత్ నగర్ లోని స్పెషల్ ట్రయల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. గోద్రా రైలు దహనం ఘటన తర్వాత జరిగిన అల్లర్లలో బ్రిటీష్ జాతీయులు ముగ్గురితో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్). గుజరాత్ అల్లర్ల సందర్భంగా సిట్ దర్యాప్తు చేస్తున్న తొమ్మది కేసులలో ఇది కూడా ఒకటి.