కరోనా: హోం క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Guidelines For Home Quanatine, Instructions For The Family Members - Sakshi

అబుదాబి: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)  ఇతర దేశస్తుల వీసాలు నిలిపివేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి17 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ఇదివరకే వీసా అమలుచేసిన వారికి ఈ నియమం వర్తించదు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తప్పా ప్రయాణాలు చేయోద్దని సూచించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను కట్టడి చేయోచ్చని యూఏఈ పేర్కొంది. అంతేగాక అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ‍కరోనా ఈ నేపథ్యంలో కీలకి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇక కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు కూడా వెల్లడించారు.

కాగా.. ఇప్పటి వరకూ ఈ కరోనా వైరస్‌ బాధితుల కేసుల సంఖ్య భారత్‌లో  81కి చేరాయి. ఈ నేపథ్యంలో వైరస్‌వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా లక్షణాలున్న వ్యక్తులు, కరోనా పీడిత ప్రాంతాల నుంచి వచ్చిన భారతీయులను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా  హోం క్వారైంటైన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చూచిస్తున్నారు. 

హోం క్వారైంటైన్‌...

  • కరోనా సోకిన వ్యక్తిని వెంటిలైజేషన్‌ ఉన్న గదిలో ఉంచాలి. వీలైతే అతనికి ప్రత్యేక టాయిలెట్‌ సదుపాయం కల్పించాలి. ఒకవేళ ఆ గదిలో ఇంకెవరైనా ఉండాల్సి వస్తే కనీసం 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 
  • ముఖ్యంగా వృద్దులు, గర్భిణిలు,చిన్న పిల్లలు వ్యాధి సోకిన వ్యక్తికి  దూరంగా ఉండాలి. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ త్వరగా సోకే  ప్రమాదం ఉంది. 
  • క్వారంటైన్‌ గది నుంచి వ్యాధి బారిన పడ్డ వ్యక్తి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి. గుంపులు, సమూహపు ప్రదేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లరాదు.
  • చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దేనినైనా తాకితే వెంటనే శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. 
  • కరోనా సోకిన వ్యక్తి వాడిన కప్పులు, దుప్పట్లు, టవెల్స్‌ లాంటి వస్తువులేవీ ఇతరులు ఉపయోగించరాదు. కరోనా సొకిన వ్యక్తి మంచాన్నిముట్టరాదు .
  • వైరస్‌ గాలి వల్ల వ్యాపించకున్నా తుంపరుల ద్వారా తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. కాబట్టి మాస్క్‌ని దరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మాస్క్‌ని ప్రతి 6-8 గంటలకొకసారి మారుస్తూ ఉండాలి. 
  • కరోనా సోకిన వ్యక్తి ఎంత జాగ్రత్తలు పాటించాలో అతనికి వస్తువులు, సామాగ్రి అందించే కుటుంబసభ్యలు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
  • ఒకసారి వాడిన మాస్క్‌లను మళ్లీ వాడరాదు. 
  • జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి కరోనా లక్షణాలు కనబడితే వెంటనే మీకు దగ్గర్లోని హెల్త్‌ సెంటర్‌ వారికి సమాచారం అందివ్వాలి. 

హోం క్వారైంటైన్‌లో కుటుంబసభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కరోనా సోకిన వ్యక్తికి ఆహారం, పానీయాలు ఏమైనా ఇచ్చేముందు చేతులకు కశ్చితంగా డిస్‌పోజల్‌  గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత వాటిని పడేయాలి. 
  • కరోనా సోకిన బాధితుడి ఆరోగ్యం మెరుగుపడ్డా మరో 14 రోజులపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లోనే ఉండాలి. బయటి వ్యక్తులను ఇంట్లోకి రానివ్వరాదు.
  • క్వారంటైన్‌లో ఉంచిన వ్యక్తి వాడిన దుప్పట్లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో  శుభ్రం చేయాలి. 
  • పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • రోగి ఉపయోగించిన దుస్తులను వేరెవరూ ఉపయోగించరాదు. వీటిని విడిగా శుభ్రం చేయాలి. 
  • కరోనా అనుమానిత వ్యక్తితో సన్నిహితంగా మెలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో,ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ సోకే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. 
    వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యవంతమైన ఆహార నియమాలు అవలంభిస్తే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top