ముండేకు అఖిలపక్ష నివాళి | great tribute to munde | Sakshi
Sakshi News home page

ముండేకు అఖిలపక్ష నివాళి

Jun 21 2014 10:24 PM | Updated on Mar 29 2019 9:24 PM

ముండేకు అఖిలపక్ష నివాళి - Sakshi

ముండేకు అఖిలపక్ష నివాళి

ప్రజానాయకుడైన గోపినాథ్ ముండే లేని లోటుపూడ్చలేనిదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు.

సాక్షి, ముంబై : ప్రజానాయకుడైన గోపినాథ్ ముండే లేని లోటుపూడ్చలేనిదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. దివంగత కేంద్ర మంత్రి గోపినాథ్ ముండేకు నారిమాన్‌పాయింట్‌లోని ఎన్‌సీపీఏలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు,  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆర్‌పిఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, దేవేంద్ర ఫడ్నవీస్, ముండే కుమార్తె పంకజ ముండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపీనాథ్ ముండేతో ఉన్న అనుబంధాలను వారు నెమరువేసుకున్నారు. అనంతరం ఆయనకు నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement