
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ బీకే కోష్యారీ చేసిన సిఫారసుకు గల రాజ్యాంగ బద్ధతపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ సిఫారసు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమని రాజ్యాంగ నిపుణుడు ఉల్లాస్ బాపట్ అన్నారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలంటూ బీజేపీకి రెండు రోజులు గడువిచి్చన గవర్నర్.. ఇతర పార్టీలకు 24 గంటలు మాత్రమే సమయమివ్వడం, కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణిగా కనిపిస్తోంది’అని అన్నారు.
అత్యవసరం అయినప్పుడు ఒక ఔషధంగా మాత్రమే రాష్ట్రపతి పాలన అ్రస్తాన్ని వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ లాయర్ శ్రీహరి ఆనె∙మాట్లాడుతూ.. ఏ పార్టీ కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని గవర్నర్ సకారణంగా భావించినప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24 నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు అన్ని పక్షాలకు తగిన సమయం ఉంది. గవర్నర్ పిలిచే దాకా వారు ఆ ప్రయత్నాలు చేయలేదనడం అర్థరహితం. ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధత తెలిపేందుకు ప్రతి పార్టీకి ఇచ్చే గడువు పై నిర్దిష్టత అంటూ ఏమీ లేదు’ అని తెలిపారు.
ముచ్చటగా మూడోసారి...
మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్‌పవార్‌కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెపె్టంబర్ 28, 2014 నుంచి అక్టోబర్ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.