సోషల్‌ మీడియా@ టూ లైఫ్స్‌

Empower Survey On Social Media - Sakshi

రెండు రకాల జీవితం గడిపేల చేస్తున్న సోషల్‌ మీడియా

సోషల్‌ మీడియా వల్ల యువత భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతుంది

పరిశోధన అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : భారతదేశంలో 400 మిలియన్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. వారిలో 200 మిలియన్ల మంది క్రియాశీలకంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మన దేశం ఇంటర్నెంట్‌ అధికంగా వినియోగించే అతిపెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకోనుందని సర్వేలు చెబుతున్నాయి. 4జీతో అత్యుత్తమ ఇంటర్నెంట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో భారతీయులు ఇప్పుడు వారానికి 28గంటలు తమ మొబైల్‌ ఫోన్లలో కాలం వెళ్లదీస్తున్నారు. 4జీ డేటా అందుబాటులోకి రావడంతో ప్రజలు సామాజిక మాద్యమాల్లో ఫోటోలు, వీడీయోలు పంచుకోవడం ఎక్కువైంది. సగటున నేటి ప్రజలు రోజుకు 2నుంచి 4 గంటలు సామాజిక మాధ్యమాల వేదికపై గడుపుతున్నారు. ఇంత ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలపై గడుపూతూ.. దానికి బానిస కావడంతో అది ప్రజల జీవితాలపై సకారాత్మక ప్రభావాలను చూపుతోంది. 

మన స్నేహితులు, బంధువులను సౌకర్యవంతమైన విధానంలో అనుసంధానం చేసేందుకు మన జీవితాల్లో అడుగు పెట్టిన సామాజిక మాద్యమాలు, ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే మాధ్యమ వేదికగా మారిపోయింది. నేడు సామాజిక మాధ్యమాలను ప్రజలు తమ గొప్పదనాన్ని ప్రదర్శించుకునేందుకు, తమ ప్రత్యేకతను గుర్తించాలన్న తపన కోసం ఉయయోగించుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికలు ఎక్కువ అవుతున్నకొద్ది ఈ పరిణామ క్రమం కూడా పెరుగుతోంది. నేడు మనం తినేది, ఏం చేస్తున్నాం, మనం దేన్ని ధరిస్తున్నాం.. ఇవన్ని వ్యాలిడేషన్‌ అవసరాలకు అనుగుణంగా ప్రభావం చూపిస్తున్నాయి. 
ఎంపవర్‌ సంస్థ సర్వే ప్రకారం స్థిరత్వంతో కూడిన వ్యాలిడేషన్‌ కొరకు ప్రజలు రెండు రకాల జీవితాలను గడుపుతున్నారు. అవి ఒకటి సోషల్‌ లైఫ్‌, రెండోది వాస్తవ జీవితం.

సోషల్‌ మీడియా లైఫ్‌ అనేది ప్రజలు తమ సామాజిక మాధ్యమాల ఫ్రొఫెల్‌ ద్వారా చూపించుకుంటున్న జీవితం.  వాస్తవ జీవితం​అనేది నిజ జీవితం. సామాజిక మాధ్యమాల్లో చూపించుకుంటున్న జీవితానికి వాస్తవ జీవితం ఏ మాత్రం పొంతన ఉండదు.

‘ సెలవు రోజుల్లో లేదా నైటౌట్లకు వెళ్లిన సమయంలో క్రమం తప్పకుండా స్నేహితులతో కాలాన్ని వెళ్లదీసే వారిని చూసిన యువత తాము ఏదో కోల్పోతున్నామని, మిగిలిన వారంతా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని భావిస్తారు. ఈ అనుభూతులనేవి యవతలో ‘పోల్చుకోవడం’ , ‘ నిరాశావాధ’   భావనలను ప్రేరేపిస్తాయి’  అని ఎంపవర్‌ తాను చేసిన వివిధ అధ్యయన నివేదికల్లో తెలిపింది. 

 అధ్యయన నివేదిక ప్రకారం.. 

  • ఆరుగురిలో ఒక యువత తమ జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటారు.
  • యువతలో ఒత్తిడి, వ్యాకులతకు సంబంధించిన అంశాలు గత 25 ఏళ్లలో 70శాతం వృద్ధి చెందిందని గుర్తించారు.
  • ప్రతి ఐదుగురిలో నలుగురు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ ఒత్తిడికి సంబంధించిన అంశాలను మరింత ఇబ్బందికరంగా మార్చుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ ప్రపంచపు తీక్షణత అనేది యువతపై తీవ్ర ప్రభావం చూపుతూ ఒత్తిడికి, అసహనతలకి మగ్గిపోయేలా చేస్తుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

సోషల్‌ మీడియాను క్రీయాశీలకంగా వినియోగించే వారు ఏం చెయ్యాలి?
ఎంపవర్‌ సంస్థ చేసిన సూచనలు

  • సామాజిక మాధ్యమాల నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకుంటూ.. ముఖ్యంగా వారాంతాల్లో వాటికి పూర్తిగా దూరంగా ఉండండి
  • యువత తమ స్నేహితులు, బంధువులను సామాజిక మాధ్యమాలతో అనుసంధానమై ఉండడం కన్నా ముఖాముఖి కలుసుకుని మాట్లాడుకోవడం​చేయాలి.
  • సామాజిక మాధ్యమాలతో సంబంధం లేని హాబీల పట్ల ఆసక్తి చూపుతూ.. తమను తాము సోషల్‌ మీడియా నుంచి ఎదురైయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
  • తమలోని లోపాలను గుర్తు తెచ్చుకుంటూ ఇతరులతో పోల్చుకోవడాన్ని వదిలి పెట్టాలి. 
  • సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న కోణం నుంచి కాకుండా వారి పూర్తి జీవితం గురించి అవగాహన పెంచుకోవడం ఉత్తమ లక్షణం
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top