అసోంను వణికించిన భూకంపం | Earthquake Rocks Assam No Report Of Damage | Sakshi
Sakshi News home page

అసోంను వణికించిన భూకంపం

Jun 11 2018 12:33 PM | Updated on Jun 11 2018 12:33 PM

Earthquake Rocks Assam No Report Of Damage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గువహటి : అసోంలో సోమవారం సంభవించిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైన భూప్రకంపనలకు నాగోన్‌ జిల్లా ధింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్‌ సెంటర్‌ పేర్కొంది. 

కాగా, భూకంప తీవ్రత ఫలితంగా వాటిల్లిన ఆస్తి, ప్రాణనష్టం  వివరాలపై ఇంకా సమాచారం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. భూప్రకంపనల తీవ్రత మధ్యస్థంగా ఉందని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement