మందు బంద్‌.. అలా ఎలా ఊగిపోయాడు?

మందు బంద్‌.. అలా ఎలా ఊగిపోయాడు? - Sakshi

సాక్షి, పట్నా: గతంలో ఇలాంటి వ్యవహారాలు కొత్తేం కాకపోయినా.. ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం కాస్త విశేషంతో కూడుకున్నదే. ఎందుకంటే అది బిహార్‌లో చోటు చేసుకుంది కాబట్టి. 

 

దర్భాంగా జిల్లాలోని ఓ ప్రాంతంలో ఈ మధ్య ఓ వేడుక సందర్భంగా రికార్డు డాన్సులు నిర్వహించారు. ఇంతలో తూలుతూ అక్కడికి విచ్చేసిన ఓ పోలీస్‌ పెద్దాయన స్టేజీపై ఉన్న యువతి యువకులను దుర్భాషలాడారు. అంతేనా తాగిన మైకంలో తాను కొన్ని స్టెప్పులు వేసినట్లు ఊగిపోయారు. పక్కనే ఉన్న కొందరు ఆయన్ని నిలువరించేందుకు యత్నించగా వారిని నెట్టేస్తూ, తిడుతూ నానా భీభత్సం చేసేశారు. 

 

సంపూర్ణ మద్యపాన నిషేధం సాధించిన నాలుగో రాష్ట్రంగా బిహార్‍లో ఈ ఘటన చోటు చేసుకోవటంతో ఆ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించారా? సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top