రానున్న రెండు రోజులు ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరంలో తుపాను వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణశాఖ తెలిపింది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణశాఖ బుధవారం చెన్నైలో వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఉత్తరం వైపునకు కదులుతోందని వాతావరణశాఖ పేర్కొంది.
ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుడంగా మారి 48 గంటలపాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది. చెన్నైలో మంగళవారం నాటి నుంచి కురిసిన వర్షం 101 మిల్లీమీటర్లగా నమోదు అయింది.