తుపాన్ అండమాన్ తీరాన్ని దాటింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తుపాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపాన్గా మారింది. తుపాన్ అండమాన్ తీరాన్ని దాటింది. వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైనట్టు చెప్పారు.
తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రేపు రాత్రి 24 గంటల్లో తీవ్ర తుపాన్గా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండవచ్చని హెచ్చరించారు. ఈ నెల 12న విశాఖపట్నం, గోపాల్పూర్ వద్ద తీరం దాటనుంది.