ఎలుకల వల్లే ఫ్లైఓవర్‌పై పగుళ్లు..!

Crack On Gill Chowk Flyover - Sakshi

చంఢీగఢ్‌ : లూథియానాలోని గిల్‌ చౌక్‌ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే స్పందించిన అధికార యత్రాంగం ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల ఎవరికి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. దీనిపై లూథియానా మున్సిపల్‌ అధికారి ధరమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌ కింది భాగంలో ఎలుకలు నివాస స్థలాన్ని ఏర్పరుచుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు. ఎలుకల కన్నాల వల్లే ఫ్లైఓవర్‌పై పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఫ్లైఓవర్‌ పగుళ్లకు ఎలుకలే కారణమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానికలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్‌ కింది భాగంలోని నేల కోతకు గురవుతుందని.. దీని వల్ల ప్రమాదం పొంచివుందని మున్సిపల్‌ శాఖకు ఆర్నేళ్ల క్రితమే తెలిపినప్పటికీ.. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top