రెండో రోజు‌ కూడా కరోనా కేసు నమోదు కాలేదు.. | Sakshi
Sakshi News home page

కేరళలో కేవలం 25 యాక్టివ్‌ కేసులు

Published Thu, May 7 2020 7:31 PM

Corona: No Fresh Cases In Kerala For 2nd consecutive day - Sakshi

తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. కేరళలో మాత్రం కరోనా నెమ్మదిస్తోంది. వరుసగా రెండో రోజు రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కూడా నమోదు కాలేదని గురువారం వైద్యాధికారులు వెల్లడించారు. కాగా బుధవారం సైతం ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని విషయం తెలిసిందే. కరోనా విషయంలో  భారీ ఊరట లభిస్తుండటంతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కేరళలో కేవలం 25 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యశాఖమంత్రి కేకే శైలజ తెలిపారు. గురువారం నాలుగురు కరోనా బాధితులకు నెగిటివ్‌ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 474కు చేరుకుందని తెలిపారు. (కూతురికి కరోనా పేరు పెట్టిన ఎంపీ! )

అలాగే రాష్ట్రంలో 56 ప్రదేశాల్లో హట్‌స్పాట్‌లను ప్రభుత్వం తొలగించిందని వెల్లడించారు.. కొత్తగా ఏ ప్రదేశాలను హట్‌స్పాట్‌గా గుర్తించలేదని, ప్రస్తుతం 33 మాత్రమే హట్‌స్పాట్‌ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం ప్రస్తుతం  16,693 మంది అబ్జర్వేషన్‌లోఉన్నారని వీరిలో 310 మంది ఆసుపత్రిలో ఉండగా మిగతా వారంతా సెల్ప్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఇక కేరళలో రికవరీ రేటు పేరుగుతుంది. ఇందుకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. (‘ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది’ )

Advertisement
Advertisement