హీరో తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు | Complaint File on Hero Vijay Father SA Chandrasekhar in Tamil Nadu | Sakshi
Sakshi News home page

నటుడు విజయ్‌ తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు

Oct 3 2019 7:40 AM | Updated on Oct 3 2019 9:19 AM

Complaint File on Hero Vijay Father SA Chandrasekhar in Tamil Nadu - Sakshi

చెన్నై,టీ.నగర్‌: నగదు మోసానికి పాల్పడినట్లు తెలిపి హీరో విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌పై కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం చిత్రనిర్మాత మణిమారన్‌ ఫిర్యాదు చేశారు. పిటిషన్‌లో ఇలా తెలిపారు. చంద్రశేఖర్‌ రూపొందించిన ట్రాఫిక్‌ రామస్వామి చిత్రం తమిళనాడు విడుదల హక్కులను బ్రహ్మానందం సుబ్రమణియం అనే వ్యక్తికి ఇస్తున్నట్లు తెలిపి రూ.21 లక్షలు అడ్వాన్సు తీసుకున్నారని, కొన్ని రోజుల తర్వాత తానే విడుదల చేస్తానని తెలిపిన చంద్రశేఖర్‌ చిత్రం విడుదల తర్వాత రూ.21 లక్షలు ఇస్తానని తెలిపారని, అయితే ఒకటిన్నర ఏడాది అయినప్పటికీ బ్రహ్మానందం నుంచి పొందిన నగదును చంద్రశేఖర్‌ తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.

దీనిగురించి బ్రహ్మానందం తనను ఫోన్‌లో సంప్రదించి చంద్రశేఖర్‌ నుంచి నగదు ఇప్పించాల్సిందిగా కోరాడని, దీనిగురించి తాను చంద్రశేఖర్‌ వద్ద మాట్లాడగా మూడు నెలల్లో నగదు ఇస్తానని తెలిపాడని, ఆయన చెప్పిన గడువు గత నెలతో ముగిసిందని తెలిపారు. తాను అతని కార్యాలయానికి వెళ్లి నగదు కోరగా కావాలంటే కొంత చెల్లిస్తానని చెప్పడమే కాకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని తెలిపారు. దీనిగురించి తగిన చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని మణిమార న్‌ ఇచ్చిన పిటిషన్‌లో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement