అలహాబాద్‌ హైకోర్టు జడ్జిని తొలగించండి | CJI writes to PM Modi for removal of Allahabad High Court judge | Sakshi
Sakshi News home page

అలహాబాద్‌ హైకోర్టు జడ్జిని తొలగించండి

Jun 24 2019 9:16 AM | Updated on Jun 24 2019 9:43 AM

CJI writes to PM Modi for removal of Allahabad High Court judge - Sakshi

జస్టిస్‌ ఎస్‌.ఎన్‌. శుక్లా

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లాను తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాశారు.

న్యూఢిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మెడికల్‌ కాలేజీలకు అనుమతులిచ్చే విషయంలో ముడుపులు అందుకున్నారని జస్టిస్‌ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ పీకే జైస్వాల్‌ నేతృత్వంలో త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది.

‘శుక్లా మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ విచారణలో తేలింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆయన్ను విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. హైకోర్టులో ఆయన న్యాయపరమైన విధులు నిర్వర్తించేందుకు వీలు లేదు. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండి’అని గొగోయ్‌ ప్రధానిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement