పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌

Cat Owner Approaches Kerala High Court Against Vehicle Pass Denial By Police - Sakshi

కొచ్చి : కరోనావైరస్‌ నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌ పాటిస్తున్న వేళ కేరళ పోలీసుపై హైకోర్టులో వింత పిటిషన్‌ దాఖలైంది. తన పెంపుడు పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్‌ నిరాకరించారని హైకోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కొచ్చి ప్రాంతానికి చెందిన ఎన్‌ ప్రకాశ్‌ అనే ఓ వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో వాటికి ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలంటూ  ఏప్రిల్‌ 4న ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాను శాకాహారినని, తన పిల్లులను ఇష్టమైన మియో పెర్సియన్‌ బిస్కెట్ల ఇంట్లో తయారు చేయలేనని, కోనేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేశారు.
(చదవండి : మాస్క్‌లు ధరించకపోతే జరిమానా)

అయితే ప్రకాశ్‌ చెప్పిన కారణం అత్యవసరమైనది కాదని భావించిన పోలీసులు ఆయనకు పాస్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ కేరళ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. జంతు హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం పెంపుడు జంతువులకు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నారు.కాగా, కేరళలో కరోనా బాధితుల సంఖ్య 314కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 109 మంది మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top