కాన్షీరాం జ్ఞాపకార్ధం.. ఖాళీ చేయం

Cant Vacate Govt Bungalow It Was Converted Into A Memorial - Sakshi

లక్నో: తనకు కేటాయించి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేది లేదని యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తాను నివాసం ఉంటున్న 13ఎ మాల్‌ ఎవెన్యూ బంగ్లా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మెమోరియల్‌గా అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఈ మేరకు మాయావతి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కి లేఖ రాశారు. 13ఎ మాల్‌ ఎవెన్యూ బంగ్లాను 2011లో కాన్షీరాం జ్ఞాపకార్ధం మార్చారని, బంగ్లాలో తనకు కేటాయించి రెండు గదులనే నివాసం కొరకు ఉపయోగించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బంగ్లా భద్రత, సంరక్షణను తాను క్షేమంగా చూసుకుంటానన్న నమ్మకంతోనే తనకు ఆ బంగ్లాను కేటాయించారని అమె లేఖలో పేర్కొన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని త్వరలోనే అధికారలకు అప్పగిస్తానని మాయావతి తెలిపారు.కాగా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ ప్రభుత్వం మాజీ సీఎంలు బంగ్లాలు ఖాళీ చేయవల్సిందిగా ఉత్తర్వులు జారిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మాజీ సీఎంలు, అఖిలేష్‌ యాదవ్‌, ములాయంసింగ్‌, ఎన్డీ తివారి బంగ్లాలు ఖాళీ చేయడం కోసం తమకు కొంత సమయం కావాలని యోగి ఆదిత్యానాథ్‌కు లేఖలు రాశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top