రెండు విమానాలకు బాంబు బెదిరింపులు | Bomb Scare For 2 Planes Headed Out Of Delhi, Both Flights Delayed | Sakshi
Sakshi News home page

రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

Jan 27 2016 3:02 PM | Updated on Sep 3 2017 4:25 PM

రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది.

న్యూఢిల్లీ: రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

 భద్రతా కారణాలతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 122 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement