కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్‌

BJP Worker Abducted in Kashmir Baramulla - Sakshi

కశ్మీర్‌: రాష్ట్రంలో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతవారం ముష్కరులు ఓ బీజేపీ నేత‌ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కశ్మీర్‌లోని బారాముల్లా మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ వైస్ ప్రెసిడెంట్ మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్‌లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లా బుధవారం ఈ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తున్నప్పుడు కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనను అపహరించి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం భద్రతా దళాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’)

బందీపోర్లో గత బుధవారం బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యను బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. మళ్లీ ఈ బుధవారం మరో బీజేపీ నాయకుడిని కిడ్నాప్‌ చేయడం గమనార్హం.(బీజేపీ నేత‌ను కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top