‘ఐదు, పది కాదు...50 ఏళ్లు అధికారంలో ఉండాలి’ | BJP is in for a long haul in power, says Amit Shah | Sakshi
Sakshi News home page

‘ఐదు, పది కాదు...50 ఏళ్లు పవర్‌లో ఉండాలి’

Aug 20 2017 2:39 AM | Updated on May 28 2018 3:58 PM

‘ఐదు, పది కాదు...50 ఏళ్లు అధికారంలో ఉండాలి’ - Sakshi

‘ఐదు, పది కాదు...50 ఏళ్లు అధికారంలో ఉండాలి’

‘మేము కేవలం 5-10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదు..కనీసం 50 ఏళ్లు అధికారంలో ఉండాలి..అప్పుడే దేశ రూపురేఖలు మార్చగలం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

భోపాల్‌: ‘మేము కేవలం 5-10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదు..కనీసం 50 ఏళ్లు అధికారంలో ఉండాలి..అప్పుడే దేశ రూపురేఖలు మార్చగలం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులతో భేటీ సందర్భంగా ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. కేం‍ద్రంలో 330 మంది ఎంపీలతో తమది మెజారిటీ ప్రభుత్వమని, వివిధ రాష్ట్రాల్లో 1387 మం‍ది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని అన్నారు.

పార్టీ ప్రస్తుత పరిస్థితితో సంతృప్తి పడరాదని, మరింత ముందుకు వెళ్లేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపు ఇచ్చారు.  ఎందరో నేతలు, కార్యకర్తల కృషి ఫలితంగా పార్టీ నేడున్న స్థితికి చేరుకుందని అమిత్‌ షా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రస్తుతం 10-12 కోట్ల మంది సభ్యులున్నారని చెప్పారు. దేశంలో ప్రతి మూలకూ పార్టీ పతాకాన్ని తీసుకువెళ్లేందుకు శ్రమించాలని కార్యకర్తలను ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement