650మందికి ఉచితంగా ‘అభినందన్‌ హెయిర్‌కట్‌’

Bengaluru Hair Designer Gives The Abhinandan Moustache To 650 Men For Free - Sakshi

బెంగళూరు : పాక్‌ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హెయిర్‌ డిజైనర్‌ ననేష్‌ ఠాకూర్‌ ఏకంగా 650 మందికి ఉచితంగా అభినందన్‌ను పోలిన జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని నా సెలూన్‌లో ఒక రోజంతా ఉచితంగా అభినందన్‌ హెయిర్‌స్టైల్‌ చేయాలని భావించాను. యువతలో దేశ భక్తిని పెంపొందించి.. వారిని డిఫెన్స్‌ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సాహించేందుకుగాను ఇలా చేశాను’ అంటూ చెపుకొచ్చారు.

ఇదిలా ఉండగా బొమ్మనహళ్లికి చెందిన ఓ సేల్స్‌మెన్‌ చాంద్‌ మహ్మద్‌ అభినందన్‌కు వీరాభిమాగా మారాడు. దాంతో ఆయన లాగా మీసాలను సెట్‌ చేయించుకున్నాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘అభినందన్‌ రియల్‌ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయనలాగా నా మీసాలు సెట్‌ చేయించుకున్నాను’ అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top