.. అయితే కన్నడ నేర్చుకో..!?

Anyone who lives in Karnataka must learn Kannada - Sakshi

సాక్షి, బెంగళూరు : కన్నడ జాతీయోద్యమం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే కర్నాటకకు ప్రత్యేక జెండా కావాలని ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలో ఉండేవారంతా.. తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని స్పష్టం చేశారు. కర్నాటక 62వ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దరామయ్య.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటక లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కన్నడ భాషను తప్పనిసరిగా నేర్పిం‍చాలని పిలుపునిచ్చారు.

కన్నిడిగుడిగా జీవించాలన్నా.. కర్నాటకలో ఉండాలన్నా.. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ కన్నడ నేర్చుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. తన నిర్ణయం దేశంలోని ఏ వర్గానకో, మతానికో వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. నేను ఇతర భాషలను నేర్చుకోవాన్ని, మాట్లాడడాన్ని వ్యతిరేకించను.. అయితే కన్నడ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అని సిద్దరామయ్య పేర్కొన్నారు.

దేశంలోని భాషల్లో హిందీ ఒకటని.. అది జాతీయ భాష కాదని చెప్పిన సిద్దరామయ్య... కన్నడిగులపై హిందీని ఎవరూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని అన్నారు. అయితే సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాక్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top