ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద సబ్సిడీ రుణాలు తీసుకున్నవారి రుణాల చెల్లింపు కాలపరిమితిని 15ఏళ్ల నుంచి 20ఏళ్లకు పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద సబ్సిడీ రుణాలు తీసుకున్నవారి రుణాల చెల్లింపు కాలపరిమితిని 15ఏళ్ల నుంచి 20ఏళ్లకు పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందస్తు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1000 కోట్లతో మధ్యస్థాయి ఆదాయ వర్గాల కోసం మరో పథకం ప్రారంభించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం లో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పీఎంఏవై పథకం కింద మంజూరుచేస్తున్న రుణాల మొత్తాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.23,000 కోట్లకు పెంచారు.