యాంకర్‌గా అమితాబా? | Amithab as anchor? | Sakshi
Sakshi News home page

యాంకర్‌గా అమితాబా?

May 26 2016 1:26 AM | Updated on Aug 21 2018 9:38 PM

యాంకర్‌గా అమితాబా? - Sakshi

యాంకర్‌గా అమితాబా?

నరేంద్ర మోదీ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఈ నెల 28న ప్రభుత్వ విజయాలను తెలుపుతూ జరిపే ప్రచార కార్యక్రమానికి అమితాబ్‌ను యాంకర్‌గా

- మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ మండిపాటు
యాంకర్‌ను నేను కాదు మాధవన్: అమితాబ్
 
 న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఈ నెల 28న ప్రభుత్వ విజయాలను తెలుపుతూ జరిపే ప్రచార కార్యక్రమానికి అమితాబ్‌ను యాంకర్‌గా ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘బచ్చన్‌ను నటుడిగా గౌరవిస్తాం. అయితే పనామా పత్రాల్లో పేరున్న  వ్యక్తిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తే, అది దర్యాప్తు సంస్థలకు ఏ విధమైన సంకేతాలను పంపుతుంది?’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. దీనిపై మోదీ పునరాలోచించాలన్నారు.

కాగా, అమితాబ్ స్పందిస్తూ.. ‘కార్యక్రమానికి నటుడు మాధవన్ యాంకర్,  అందులో భాగమైన బేటీ బచావో బేటీ పడావోకు మాత్రమే ప్రయోక్తని. ది కాంగ్రెస్ వారికి తెలిసి ఉండకపోవచ్చు’ అని అన్నట్లు తెలుస్తోంది. కాగా, మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ బుక్‌లెట్‌ను, వీడియోను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement