'చైనా గొడవలో ప్రపంచమంతా భారత్‌తోనే' | Sakshi
Sakshi News home page

'చైనా గొడవలో ప్రపంచమంతా భారత్‌తోనే'

Published Thu, Jul 20 2017 3:12 PM

'చైనా గొడవలో ప్రపంచమంతా భారత్‌తోనే'

న్యూఢిల్లీ: చైనా విషయంలో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత్‌తోనే ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. సిక్కింలోని డోక్లామ్‌ వివాదం విషయాన్ని తెలిసి ఆయా దేశాల ప్రతినిధులంతా దిగ్బ్రాంతికి గురయ్యారని వ్యాఖ్యానిస్తూ చైనా విదేశాంగ ప్రతినిధులు చెప్పిన నేపథ్యంలో గురువారం సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు కారణం లేకుండా భారత్‌ ఏ విషయాన్ని చెప్పలేదని, ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత్‌కే మద్దతిస్తున్నాయని అన్నారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని విధాల దౌత్యమార్గాలను అనుసరిస్తున్నామని, చైనా మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతూ భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని సీరియస్‌ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మాత్రమే కాదు.. ఇరు దేశాల సైన్యాలను వెనక్కి పిలవాలని కోరుతున్నాం.. ఆ తర్వాత చర్చలకు రావాలంటున్నాం. కానీ, చైనా మాత్రం భారత్‌ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటేనే చర్చలని చెబుతోంది.

ఇప్పటికే డోక్లామ్‌ ప్రాంతం భారత్‌లో భాగం అని ఇప్పటికే భూటాన్‌, భారత్‌ చెబుతున్నాయి. అలాగే, డాంగ్‌లాంగ్‌ చైనాది.. అది భూటాన్‌ది కూడా. చైనా, భూటాన్‌ మధ్య వ్యవహారం అయితే మాకు సంబంధం లేదు.. మేం పట్టించుకోం కూడా అయితే, ఇప్పుడు మూడు దేశాలతో ముడిపడిన వ్యవహారం. దీన్ని తేలిగ్గా వదిలేస్తే రక్షణ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి' అని సుష్‌మా స్వరాజ్‌ గురువారం పార్లమెంటులో తెలిపారు.

Advertisement
Advertisement