సీఎం చొరవతో 20 మంది మత్స్యకారులకు విముక్తి

20 AP Fishermen To Be Freed From Pakistan On 6th January - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారుల విడుదలకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 1 నెలల పాటు పాకిస్తాన్‌ చెరలో ఉన్న 20 మంది మత్స్యకారులు సోమవారం విడుదలయ్యారు. ఈరోజు మధ్యాహ్నం వారు వాఘా సరిహద్దు గుండా స్వదేశానికి చేరుకోనున్నారు. గుజరాత్ తీర ప్రాంతం నుంచి చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ దృష్టికి మత్స్యకార కుటుంబాలు తమ సమస్యను తీసుకురాగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ఆ పనిని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందానికి అప్పగించారు.
(చదవండి : ఆంధ్రా జాలర్ల విడుదలకు పాక్‌ అంగీకారం)

ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది. భారత్‌ విఙ్ఞప్తి మేరకు మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్‌ అంగీకరించింది. నేడు వాఘా సరిహద్దు వద్ద 20 మత్స్యకారులను పాకిస్తాన్‌ భారత్‌కు అప్పగించనుంది. మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అక్కడికి బయల్దేరి వెళ్లారు. వైద్య పరీక్షలు, అధికారిక లాంఛనాల అనంతరం దౌత్య అధికారులు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, అధికారులకు మత్స్యకారులను అప్పగించనున్నారు. రేపు ఉదయం వారంతా ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు.. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక సంక్రాంతి నేపథ్యంలో తమవారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటుండటంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

(చదవండి ఐ సీఎం జగన్‌ చొరవతోనే మత్స్యకారుల విడుదల)

పాకిస్తాన్‌ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా..
ఎస్‌.కిశోర్‌ , తండ్రి అప్పారావు
నికరందాస్‌ ధనరాజ్, తండ్రి అప్పన్న
గరమత్తి, తండ్రి రాముడు
ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు
ఎస్‌. అప్పారావు, తండ్రి రాములు
జి. రామారావు, తండ్రి అప్పన్న
బాడి అప్పన్న, తండ్రి అప్పారావు
ఎం. గురువులు, తండ్రి సతియా
నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య
నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్‌
వి. శామ్యూల్, తండ్రి  కన్నాలు
కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు
డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి
కందా మణి, తండ్రి అప్పారావు
కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు
శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు
కేశం రాజు, తండ్రి అమ్మోరు
భైరవుడు, తండ్రి కొర్లయ్య
సన్యాసిరావు, తండ్రి మీసేను
సుమంత్‌ తండ్రి ప్రదీప్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top