
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంత రైతుల కోసం మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ)కు రూపకల్పన చేశారు. అప్పట్లోనే నిధులు కూడా మంజూరు చేశారు. తాజాగా పనులు పూర్తికాగా మంత్రి హరీశ్‌రావు ఇటీవల నీరు విడుదల చేశారు.
ఈ కాల్వల కింద ప్రస్తుతం వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నారు పోసుకున్న జంగారెడ్డిపల్లికి చెందిన ఓ రైతు అందులో ‘వైఎస్సార్–కేఎల్‌ఐ’అని కనిపించేలా మధ్యలో బాట వదిలి తన కృతజ్ఞత చాటుకున్నాడు. – సుధాకర్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నాగర్ కర్నూల్ జిల్లా